ఇండియా స్మార్ట్‌టివీ సెగ్మెంట్లో ప్రపంచ దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. చైనా దిగ్గజం షియోమి అలాగే దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజాలు శాంసంగ్, ఎల్జీ కంపెనీలు స్మార్ట్ టీవీలను అత్యంత సరసమైన ధరల్లో వినియోగదారులకు అందిస్తూ వస్తున్నాయి. వీటికి సవాల్ విసురుతూ మరో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు షింకో దూసుకొచ్చింది. తన నూతన ఎల్ఈడీ టీవీ ఎస్వో4ఏ ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
ఫీచర్ల విషయానికి వస్తే 39 ఇంచెస్ స్క్రీన్, 1366x768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను, రెండు హెచ్డీఎంఐ పోర్టులు ఈ టీవీలో ఉన్నాయి. అలాగే రెండు యూఎస్బీ పోర్టులను ఈ టీవీలో పొందుపర్చింది. 4కె వీడియో ప్లేబ్యాక్‌కు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అలాగే 20 వాట్ల సామర్థ్యం ఉన్న స్పీకర్లను జోడించింది. దీని ధరను రూ.13,990 ధరగా కంపెనీ నిర్ణయించింది. షింకో ఎల్‌ఈడీటీవీ ధరను రూ.6490 నుంచి ప్రారంభమై, రూ.60 వేల(65 ఇంచెస్) మధ్య వినియోగ దారులకు లభ్యమవుతున్నాయి.
కాగా ఇప్పటికే టీసీఎల్, ఇఫ్లాకాన్ టీవీలు మార్కెట్లో మంచి ఆదరణను చూరగొన్నాయి. వీటి సరసన ఇప్పుడు షింకో కూడా చేరింది. షింకో టీవీలో అత్యధిక ధర రూ.59,990గా ఉంది. 65 అంగుళాల మోడల్ ధర ఇది. ఇదిలా ఉంటే శాంసంగ్ తన నూతన NU6100 seriesలో టీవీలను లాంచ్ చేసిన సంగతి అందరికీ విదితమే. 43 అంగుళాల ఈ టీవీ ధర దాదాపు రూ.41,990గా ఉంది.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°²à°œà±€ షియోమి టీవీ షింకో à°Žà°²à±à°ˆà°¡à±€ టీవీ à°Žà°¸à±â€Œà°µà±‹4à°